యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి ఏడాది గడుస్తున్నా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా కంటే వెనుక ప్రకటించిన ఆదిపురుష్, సలార్ సినిమాల ఫస్ట్‌లుక్‌లు కూడా విడుదలైపోయాయి.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి అప్డేట్ పై డైరెక్టర్ స్పందించాడు. ట్విట్టర్ లో ఓ అభిమాని ట్వీట్ కు సమాధానంగా నాగ్ అశ్విన్ స్పందిస్తూ… కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29, ఫిబ్రవరి 26న అప్‌డేట్ వస్తుందని రిప్లై ఇచ్చాడు.