ఓ బేబీతో సూపర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ నందిని రెడ్డి… ఆ తరవాత గ్యాప్ తీసుకుంది. మరోసారి సమంతతోనే పాన్ ఇండియా మూవీ చేస్తుందని మొన్నటి వరకు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
కానీ ఇప్పుడు డైరెక్టర్ నందినిరెడ్డి సందీప్ కిషన్ హీరోగా మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా నిర్మాణంలో ఈ మూవీ రానుంది. అలా మొదలైంది, ఆహా కల్యాణం జోనర్లో సాగే ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. కథానాయిక పాత్రకి చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో… సినిమా రానుండగా, సందీప్ కిషన్ ఏ 1 ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తున్నాడు. జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. జనవరిలో గానీ, ఫిబ్రవరిలో గానీ నందిరెడ్డి సినిమా మొదలయ్యే ఛాన్సుంది.