ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన సినిమా కెజిఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న కెజిఎఫ్ పార్ట్ 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పార్ట్ 2 కు సంబంధించి సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ లుక్ లో ఎంతో భయంకరంగా కనిపించిన సంజయ్ గెటప్ వెనుక చాలా కష్టం ఉందట. ఈ మేర దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.
అధీర పాత్రను చూస్తే ఎవరైనా భయపడిపోవాలన్నట్లు ఉండాలని మేం అనుకున్నాం. అందుకే వైకింగ్ లుక్‌వైపు మొగ్గు చూపాం. ఇదే విషయాన్ని సంజయ్ సర్‌కు చెబితే, అందుకు తగినట్లు మారడానికి ఎంతో కష్టపడ్డారు. మాకు ఎంతో సాయం చేశారు. ఈ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపారని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు.