సంపాదన దాచుకోవడానికి మాత్రమే కాదు కొంత మన చుట్టూ ఉన్నవారు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునే వారికి కూడా పంచటం అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. తమ జీవితాలను సినిమాకే అంకితం చేసి, ప్రస్తుతం పని లేకుండా ఉన్న డైరెక్టర్లు, కో-డైరెక్టర్లలో కొంతమందికైనా సహయం చేయాలని ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా అందించిన విజయం సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఉంది. మాకు తోచిన సహయన్ని అందించాలని ఉంది. దయచేసి ప్రేమతో అంగీకరించండి, ఇదేమి పెద్ద సహాయం కాదు చిన్న చిరునవ్వులాంటి పలకరింపు అంతే అంటూ 20 మందికి సహాయం చేయబోతున్నట్లు తెలిపారు.
పైగా మేము బ్రతికి ఉన్నంతకాలం దేవుడు ఇలాంటి శక్తినే ఇస్తే… ప్రతి సంవత్సరం ఇలాంటి సహాయం చేయాలని ఉంది అంటూ పెద్ద మనస్సు చాటాడు పూరి జగన్నాథ్.