మంచి మాస్ మసాలా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న చిత్రం ఫైటర్. ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ కాకపోయినా… వర్కింగ్ టైటిల్ గా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చకుంది.
అయితే… ఫైటర్ లో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే విదేశాల నుండి పిలిపించిన స్టార్ ఫైటర్స్ ఆద్వర్యంలో కొన్ని ఎపిసోడ్స్ తెరకెక్కించారు. లాక్ డౌన్ కు ముందే వారంతా తమ దేశాలకు వెళ్లిపోయారు.
కానీ ఈ సినిమాలో షూట్ చేయాల్సిన మరిన్ని ఫైటింగ్ సీన్స్ మిగిలిపోవటంతో… విదేశాల నుండి ఫైటర్స్ ను రప్పించలేక పూరీ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే లోకల్ టాలెంట్ పై హంట్ చేస్తున్న దర్శకుడు… సరైన వారు దొరికితే పని కానిచ్చేయాలని, లేదంటే కొన్ని సీన్లలో స్క్రిప్ట్ మార్చక తప్పదని ఫిక్స్ అయ్యారట.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తుండగా… చార్మి, పూరీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.