విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ చేస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్… తన నెక్ట్స్ మూవీపై కూడా ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నాడట. ఫైటర్ గా తెరకెక్కుతున్న విజయ్ మూవీ అయిపోగానే, మహేష్ బాబుతో సినిమా ఉంటుందని ఇన్నాళ్లు ప్రచారం సాగింది.
కానీ ఇప్పుడు మహేష్ బాబుతో మూవీ కాదని, బాలయ్యతో పూరీ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. గతంలో బాలయ్యతో పూరీ పైసా వసూల్ మూవీ చేశాడు. దీంతో బాలయ్య కోసం ఇప్పుడు పూరీ మళ్లీ కథ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే బాలయ్యకు కథ వినిపించి, మూవీకి ఓకే చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట పూరీ.
కరోనా వైరస్ లాక్ డౌన్ లో కొత్త సినిమా స్క్రిప్ట్ అయితే రెడీ చేశారు కానీ బాలయ్య ఎంతవరకు ఇంప్రెస్ అయి వెంటనే ఒకే చెబుతాడు అన్నది చూడాలి.