పూరీ జగన్నాథ్… ఇస్మార్ట్ శంకర్ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టడంతో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. అతి త్వరలో సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ప్యాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దేందుకు పూరీ ఇప్పటికే వర్కవుట్ చేస్తూ… బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ సహకారం తీసుకుంటున్నారు. ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ నటిస్తుండటం విశేషం.
అయితే, ఈ సినిమా తర్వాత బాలీవుడ్ చాన్స్‌లు రావటం పక్కా అనుకున్నారో లేక ఇక నుండి హిందీ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నారో కానీ పూరీ తన నివాసాన్ని ముంబైకి షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. ఇక నుండి ముంబై బేస్‌డ్‌గానే పూరీ సినిమాలు తీస్తారని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.