ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీతో బిజీబిజీగా ఉన్న డైరెక్టర్ రాజమౌళి. భారీ బడ్జెట్ మూవీని భుజాలకెత్తుకున్న రాజమౌళి.. దసరాతో ఫ్రీ కానున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తానని ప్రకటించిన రాజమౌళి… వెంటనే సినిమాను మొదలుపెట్టేలా కనపడటం లేదు.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేష్ కోసం ఓ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. కథను రాజమౌళి విని… మార్పులు చేర్పులు సూచించే అవకాశం ఉంది. అయితే… ఈ పనంతా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాతేనని, అప్పటి వరకు తను మహేష్ సినిమాపై ఫోకస్ చేయకూడదని డిసైడ్ అయ్యారు.
ఆర్.ఆర్.ఆర్ మూవీ దసరాకు రిలీజ్ కానుంది. దీంతో కాస్త టైం తీసుకొని, కథను ఫైనల్ చేసి… ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసి… షూటింగ్ టైం రావాలంటే కనీసం వచ్చే ఏడాది పట్టాలెక్కెలా ఉంది.
మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది.