బాహుబలి సినిమా తరువాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి మొదటి నుంచి కూడా తన కథకి తగ్గట్టుగానే హీరోలను మార్చుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు బాహుబలి సినిమాలో ప్రభాస్, రానాల శరీర ఆకృతిని పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం RRR చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ఇటీవల ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఒక వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో అందరికి తెలిసిపోయింది. ఇక రాంచరణ్ కూడా షూటింగ్ కి బయలు దేరాడు. రాంచరణ్ ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కోరమీసంతో బాడీ షేప్ పూర్తిగా మార్చేసిన రాంచరణ్‌ను చూసిన అభిమానులు చిరుత సినిమాలో ఉన్న రాంచరణ్ ఇప్పుడున్న రాంచరమ్ ఒకరేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.