దర్శకదీరుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి రాజమౌళి. రాజమౌళి చేతిలో కథ పడిందంటే చాలు… బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్టే. ఇందులో ఎవరూ కనీసం సందేహం కూడా వ్యక్తం చేయరు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ను పెంచేసిన జక్కన్న మెడకు ఇప్పుడు ఫ్యాన్స్ వార్ చుట్టుకున్నట్లు కనపడుతోంది.
రాజమౌళి ప్రస్తుతం RRR సినిమా చేస్తున్నాడు. ఇందులో మెగా హీరో రాంచరణ్, నందమూరి వారసుడు ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. దీంతో సహాజంగానే తమ హీరో గొప్పంటే… తమ హీరో గొప్ప అని కొట్టుకునే ఫ్యాన్స్ ఊహించినట్లుగానే సినిమాపై వెయ్యి కళ్లతో వేచి చూశారు.
రాంచరణ్ బర్త్ డే సందర్భంగా… తన పై ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో చరణ్ బాడీ లాంగ్వేజ్, వీరత్వం చూపిన తీరుతో అంతా రాజమౌళిని ఆకాశానికి ఎత్తుతున్నారు. అయితే… ఇక్కడి నుండే జక్కన్నకు అసలు చిక్కు మొదలైపోయింది. ఆ వీడియో ఆ రేంజ్ హిట్ అయ్యిందంటే… చరణ్ బాడీ, యాక్టింగ్ కారణమని మెగా ఫ్యాన్స్, కాదు ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఆ వీడియోకు హైలెట్ అంటూ నందమూరి ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టేశారు.
కేవలం 30 సెకన్ల వీడియోకే పరిస్థితి ఇలా ఉంటే… సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాక ఎలా ఉంటుందో, సినిమా తేదీలు దగ్గర పడుతున్న కొద్ది పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆసక్తి, కంగారు అప్పుడే మొదలైపోయాయి.
అయితే… అక్కడున్నది మాములు డైరెక్టర్ కాదు, ఆ మాత్రం హ్యాండిల్ చేయటం తెలియని వాడా…? ఖచ్చితంగా జక్కన్న మాయ చేసి అందర్నీ మెప్పిస్తాడు అంటూ రాజమౌళిని వెనుకేసుకొచ్చే వారు కూడా ఉన్నారు.