తెలుగు సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చూపించిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో తన స్థాయి ఎంటో చూపించిన దర్శకుడు నిజంగా మరీ అంత తక్కువైపోయాడా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియాలో అత్యధిక ఆదాయం పొందుతున్న సెలబ్రిటీల లిస్ట్‌ను విడుదల చేసింది ఫోర్బ్స్ ఇండియా. టాప్ 100 ఎర్నర్స్ లిస్ట్‌లో విరాట్ టాప్ ప్లేస్ సొంతం చేసుకోగా… ప్రభాస్ 44వ స్థానం దక్కించుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు 54వ స్థానం, త్రివిక్రమ్ శ్రీనివాస్ 77వ స్థానంలో ఉన్నారు.
ఇక తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్‌కు వలసవెళ్లిన తాప్సీకి కూడా స్థానం దక్కినా… మన రాజమౌళికి మాత్రం టాప్ 100లో లేకపోవటం అభిమానులను నిరాశపర్చింది. అంత పెద్ద హిట్ దర్శకుడి సంపాదన వారి కన్నా తక్కువా అంటూ రాజమౌళి అభిమానులు చర్చించుకుంటున్నారు.
మహేష్ మాస్టర్ స్కెచ్‌కు అల్లు అర్జున్ బలైపోతాడా…?
అయితే ఇందులో అసలు రహస్యం ఉందనే వారు కూడా లేకపోలేదు. రాజమౌళి సంపాదన అంతా సింగిల్ నేమ్‌తో ఉండదని… తన భార్య రమా రాజమౌళి కాస్టూమ్స్ డిజైనర్‌గా, సంగీతంలో కీరవాణి, శ్రీవళ్లి, రాజమౌళి కొడుకుతో పాటు స్టోరీ రైటర్‌గా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కలిపి తీసుకుంటారని దాంతో ఎక్కడా ఒక్కరి పేరుపై ఉన్నట్లు కనపడదని… అందుకే చోటు దక్కలేదని అంటున్నారు.