RRR సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావటంతో దేశవ్యాప్తంగా RRR కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి తన సినిమాకు తనే బిజినెస్ కూడా చూసుకుంటాడు. సినిమా ప్రమోషన్లు, ఎలా జనాలకు దగ్గరకు చేయాలో అన్ని పక్కాగా ప్లాన్ చేస్తాడు.
RRR సినిమా శాటిలైట్ రైట్స్ ను ఇప్పటికే అమ్మేసినట్లు తెలుస్తోంది. భారీ ధరకు డీల్ కుదిరిందని, ఇందుకోసం శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న వారు భారీ అడ్వాన్స్ చెల్లించినట్లు ఇండస్ట్రీ టాక్. ఇటు హిందీ రైట్స్ పై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళికి ఉత్తరాధిన భారీ మార్కెట్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్, నిర్మాత కరణ్ జోహార్ వంటి ప్రముఖులు పోటీపడుతున్నారు.
బాహుబలి షూటింగ్ మార్చి నెలాఖరుకు పూర్తికానుంది. దీంతో ఫైనల్ డ్రాఫ్ట్ వరకు ఆగి డీల్ క్లోజ్ చేస్తారా…? బడ్జెట్ భారం పడకుండా నిర్మాతను దృష్టిలో ఉంచుకొని అడ్వాన్సు తీసేసుకుంటారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. RRRని దసరా బరిలో ఉంచనున్నారు. తెలుగులో పెద్ద సినిమాలైతే రిలీజ్ కాబోతున్నాయి కానీ RRR వచ్చే నాటికి హిందీలో పెద్ద సినిమాలు లేవు. దీంతో థియేటర్లకు జనం ఎంతవరకు వస్తారన్న సందిగ్ధంలో నిర్మాతలున్నట్లు తెలుస్తోంది.
కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, ఎన్టీఆర్-రాంచరణ్- అలియాభట్-అజయ్ దేవగన్-ఓలివా మోరిస్ వంటి తారలు నటిస్తున్నారు.