తెలుగు సినిమాను అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు… జనంలో క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఇప్పుడు RRR అంటూ మల్టీస్టారర్‌తో జక్కన్న వస్తుండటంతో… ఇండస్ట్రీ చూపంతా అటు వైపే ఉంది.
నందమూరి, మెగా అభిమానులంతా ఓకేసారి ఇలా ఓ సినిమా కోసం ఎదురు చూడటం అరుదైన విషయమే. అయితే… రాజమౌళి తన సినిమా పూర్తయ్యే వరకు హీరోల స్టైల్ నుండి ఏదీ బయటకు రాకుండా జాగ్రత్తపడతాడు. ఈ మధ్య కొన్ని షూటింగ్ సన్నివేశాలు నెట్‌లో ప్రత్యక్షం కావటంపై ఎలా సీరియస్ అయ్యారో తెలిసిందే.
తాజాగా… జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు ఒకే ఫ్రేంలో కరోనా వైరస్‌తో జాగ్రత్త అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో ఇద్దరి గెటప్‌లు RRR సినిమా కోసం మెయింటేన్ చేస్తున్నవే కావటం, ఈ వీడియో వచ్చాక కొద్దిసేపట్లోనే డైరెక్టర్ రాజమౌళి కరోనా మీద ప్రకటన చేయటం చూస్తుంటే… కరోనా వైరస్ పేరుతో జక్కన్న RRR ప్రమోషన్ మొదలుపెట్టేశాడని, ప్రమోషన్‌లో భాగం కాబట్టే ఒకే ఫ్రేమ్‌లో ఉండేలా చూసుకున్నాడన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
కరోనా వైరస్‌తో ఓవైపు అవర్నేస్, మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడని… స్వామి కార్యం, స్వకార్యం రెండూ పూర్తవుతున్నాయన్న సామెత గుర్తుకు తెస్తున్నాడని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక రాంచరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ కాబోతుంది.