వివాదాలకు దూరంగా ఉండే దర్శకుడు రాజమౌళి. ఎల్లప్పుడూ వివాదాలతోనే ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంటుంది. అయితే… వర్మ కొన్ని సందర్బాల్లో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేసినా, రాజమౌళి మాత్రం కాంట్రవర్సిలో తలదూర్చరు.
కానీ సడెన్‌గా రాజమౌళి వర్మను నిన్ను ఏమని పిలవాలి అంటూ ట్వీట్ చేశాడు. అయితే… ఇదేదో సీరీయస్ అంశంలో కాదు. రాంగోపాల్ వర్మ కూతురు రేవతి ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రాంగోపాల్ వర్మకు కాంగ్రాట్స్ చెబుతూ… రాజమౌళి చేసిన ఫన్నీ ట్వీట్ ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది.
కంగ్రాట్స్ రాము తాతయ్య గారు… మీ మనుమరాలు మీతో కలుపుకోలుగా ఉంటుంది కానీ మీరు తనతో ఏమని పిలిపించుకుంటారు… రాము తాత అనా, గ్రాండ్ ఫా రాము అనా లేక రాము నాన్న అనా అంటూ ఆర్జీవీని ట్యాగ్ చేశారు.
మాములుగానే సెటైర్స్ పేల్చే ఆర్జీవీ… ఇప్పుడు రాజమౌళి ట్వీట్‌కు ఏవిధంగా రిప్లై ఇస్తారో చూడాలి.