రామ్ గోపాల్ వర్మ…సినీ మేథావి. సామాజానికి ఓ చిక్కు ప్రశ్న.వ్యక్తి స్వాతంత్రానికి విజువల్ ఎఫెక్ట్. ఓడ్కాకి వారసుడు. శ్రీదేవికి చిరకాల ప్రేమికుడు. దెయ్యాలకు దగ్గర బంధువు. ఇంకా చెప్పాలంటే సోషల్ రుషి. ఎన్ని విధాలుగా చెప్పినా ఏదో ఒక యాస్పెక్ట్ మిస్ అవుతాం.
తాజాగా ఓ వివాదాస్పద వ్యాఖ్యలు నిమిత్తం వార్తల్లో నిలిచాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వర్మ.. విద్యార్థులకు ఉచిత సలహాలు ఇచ్చాడు. నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అని వర్మ విద్యార్థులకు సూచించారు.
ఉన్నది ఒక్కటే జీవితం అని.. చనిపోయాక స్వర్గానికి వెళ్తే రంభ, ఊర్వశి, మేనకలు ఉండకపోవచ్చని.. కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయండని విద్యార్థులకు సలహాలు ఇచ్చాడు కాంట్రావర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.
అంతేకాకుండా భయంకరమైన వైరస్ వచ్చి నేను తప్ప మగజాతి అంతా పోవాలని.. అప్పుడు స్త్రీ జాతికి నేను ఒక్కడినే దిక్కు కావాలని మరోసారి తనదైన మాటలతో వర్మ కాంట్రావర్సీ క్రియేట్ చేశారు.
అయితే, వర్మ విద్యార్థులకు ఇచ్చిన ఈ ఉచిత సలహాలకు నాగార్జున యూనివర్శిటీ వీసీ వత్తాసు పలకడం గమనార్హం. వీసీ వర్మకు మద్దతు తెలపడమే కాకుండా..రామ్ గోపాల్ వర్మ ఒక ప్రొఫెసర్, ఫిలాసఫర్ కంటే ఎక్కువని ప్రశంసలు కురిపించడం విశేషం.
దర్శకుడు వర్మకు పీహెచ్‌డీ, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయని వీసీ ఆకానికెత్తారు. ఇక, వివాదస్పద దర్శకుడు వర్మ, యూనివర్శిటీ వీసీ వ్యాఖ్యలతో యూనివర్శిటీ మహిళా ఉద్యోగులు విస్తుపోయారు. వర్మ చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.