తెలంగాణ ప్రభుత్వంపై ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో తాలిబన్ల పాలన అంటూ ఆర్జీవీ చేసిన సెన్సేషనల్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ విషయంపైనైనా తనదైన స్టైల్లో వినూత్నంగా రియాక్ట్ అవుతారు ఆర్జీవీ. ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి సంచలనాలు రేపుతుంటారు. తాజాగా ఆయన హైదరాబాద్ పబ్‌లు, హైదరాబాద్ పోలీసులపై విరుచుకుపడ్డారు.
Sir, #KCR @KTRTRS and @CPHydCity when we are all living in the same country called India ,why are only Hyderabadis being subjected to Taliban rule sir ? How come the NO music time is 1 AM everywhere else in the country and 10 pm in Hyderabad sir ? #HyderabadTaliban
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2022
హైదరాబాద్ లో రాత్రి 10 గంటల తర్వాత పబ్స్ లో సౌండ్లు లేకపోవడంపై ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పబ్స్ ను స్మశాన వాటికలతో పోల్చారు. కష్టపడి పని చేసిన తర్వాత చిన్నపాటి ఆనందాన్ని పొందేందుకు పబ్స్ కు వెళ్తున్న యువకులను ఆపడం తాలిబన్ లాగ అనాగరికమన్నారు ఆర్జీవీ.
ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, వివిధ దేశాల్లో రాత్రి 1 గంటల వరకు పబ్ లు తెరిచి ఉంచుతుంటే, హైదరాబాద్ లో మాత్రం రాత్రి 10 గంటలకే మూసేస్తున్నారని ట్వీట్ లో తెలిపారు. రాత్రి 10 గంటలు దాటితే, సైరన్ తో వచ్చి, పోలీసులు నానా రచ్చ చేస్తున్నారన్నారు.
ఈ అనుభవం తనకు కూడా ఎదురైందని, దీనిపై స్పందించాలని సీఎం కేసీఆర్, కేటీఆర్ లను కోరారు ఆర్జీవీ. హైదరాబాద్ లో తాలిబన్ల పాలన నడుస్తుందా? అని నిలదీశారు. పబ్ కల్చర్ పై ఎలాగైనా సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ట్వీట్ లో పేర్కొన్నారు వివాదాల డైరెక్టర్ ఆర్జీవీ.