సంక్రాంతి కోడి పందాల జోరు కొనసాగుతున్న వేళ కాకినాడలో సందడి చేశారు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం వలసపాకలో కోడి పందాలు వీక్షించారు రామ్ గోపాల్ వర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా జీవితంలో మొట్ట మొదటిసారి ఆంధ్రాలో పబ్లిక్ గా ప్రజలతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నా అని వెల్లడించారు.
అలాగే నటుడు నాగబాబు వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు. నాగబాబు ఏం మాట్లాడారో వినలేదు.. ఆయన ఏ కామెంట్స్ చేశాడో చూసి ఆ తర్వాత స్పందిస్తాననన్నారు. ఫ్రెండ్స్ పిలిస్తే ఇక్కడికి వచ్చాను.. అంతే అని తెలిపారు. దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని నన్ను ద్వేషించే పార్టీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై జనసేన నాయకుడు నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ పెద్ద ఎదవ, నీచ్, కమీన్, కుత్తేగాడు ఇండస్ట్రీలో లేడని మండిపడ్డారు. వాడు అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. కాబట్టి వాడి గురించి నేను మాట్లాడను.
నేను కులాన్ని గౌరవిస్తాను.. కానీ కుల పిచ్చి లేదన్నారు. ఒక కులాన్ని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా పెద్ద తప్పున్నారు. ఏ కులమైనా ఎందుకు అమ్ముడు పోతుంది? అంత ఆత్మాభిమానం లేకుండా బతుకుతున్నారా ప్రజలు? అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు నాగబాబు.