వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొన్నేళ్లుగా తీస్తున్న చిత్రాలు, చేస్తున్న ట్వీట్స్ వివాదాస్పదంగానే సాగుతున్నాయి. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత చిత్రం అంటూ న్యాయస్థానాలకు దొరక్కుండా తను అనుకున్నది చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మరో యదార్థ సంఘటన ఆధారంగా వెబ్ సిరీస్ నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించి ఓ ఆడియో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇది మహాభారతం కాదు అనే టైటిల్ తో రాబోతున్నాడు.
గిది 2019ల తెలంగాణలో ధర్మన్న, దుర్యన్న ఫ్యామిలీల నడిమిట్ల లొల్లి లేపిన ద్రుపది, కొట్లాట పెట్టిన గోపాల్ యాదవ్ గాని కథ’ ఆధారంగా తీస్తున్న వెబ్ సిరీస్‌గా ఆర్జీవీ ప్రకటించాడు. సిరాశ్రీ రచనలో, ఆనంద్ చంద్ర దర్శకత్వంలో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతున్నట్లు తెలిపాడు. మహాభారతంలోని పాత్రలను ప్రస్తావిస్తూ… తన వాయిస్ ఓవర్‌తో రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ఆడియో పోస్టర్ వీడియో ఆసక్తికరంగా ఉండటం గమనార్హం.
Here is audio poster of “ఇది మహాభారతం కాదు” series . https://t.co/9ewX2IzaG1 Voice is not mine but is original voice of who voiced BHAGWADGEETA in MAHABHARATAM time. He just imitated my voice with his God voice and I think did decent job #idhiMAHABHARATHAMkaadhu @SparkSagar1
— Ram Gopal Varma (@RGVzoomin) January 18, 2021