వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం మర్డర్. మిర్యాలగుడలో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో అమృత, ఆమె కుటుంబ సభ్యులు కోర్టును కూడా ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు…. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సినిమా విడుదల తేదీ కూడా ఖరారైంది.
తాజాగా సినిమా విడుదలపై స్పందించిన ఆర్జీవీ, మర్డర్ అనేది మారుతీరావు, అమృతకు సంబంధించిన కథ కాదని, అలాంటి ఎన్నో సంఘటనల ఆధారంగా బయట ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా తీసిన ఊహాజనిత కథతో తీసిన సినిమా అని వర్మ పేర్కొన్నారు. మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతామని వర్మ తెలిపారు. అక్కడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామన్నది అప్పుడే చెబుతానన్నారు.
మర్డర్ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది.