కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాను మంచు మోహన్ బాబు, డైరెక్టర్ రత్నబాబు కలిసి థియేటర్ లో చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు డైరెక్టర్ రత్నబాబు.
సినిమా చాలా మందికి నచ్చిందని… మార్పు అనేది అవసరమని సమాజం లో చాలా వరకు మార్పు రావాలని అన్నారు. ఆ మార్పు కోసం ఈ సినిమా చేశామన్నారు రత్నబాబు. సన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ కు తగ్గ బాధ్యత తో ఈ సినిమా చేశానన్నారు.
చాలా మంది టేకింగ్ విషయంలో రామ్ గోపాల్ వర్మతో నన్ను పోలుస్తున్నారని అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే మోహన్ బాబు పై జరిగే ట్రోల్స్ పై కూడా స్పందించారు రత్నబాబు.
ట్రోలింగ్ చేసే వారికి థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సన్ ఇండియా సినిమా ఒకటి ఉంది. అది ఫిబ్రవరి 18న రిలీజ్ అవుతుంది అని అందరికి తెలిసేలా చేశారని అన్నారు. అలాగే ట్రోల్ చేసే వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ఒక సినిమా ఆడితే డైరెక్టర్ ఉంటాడు. అతని ఫ్యామిలీ ఉంటుంది లేదంటే… ఇండస్ట్రీ లో ఎక్కడా ఆ డైరెక్టర్ కనపడడు. అది ఒక్కటిగుర్తుపెట్టుకుని ట్రోల్స్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు రత్నబాబు.
Advertisements