బూతు లేనిదే హిట్ కొట్టలేమన్న వారి లిస్ట్‌లో మరో డైరెక్టర్ కూడా చేరినట్లున్నారు. పోస్టర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెబుతూ… ఎన్నో రోజుల నుండి వెంటాడుతున్న ప్లాఫ్స్‌ను కొత్త సంవత్సరంలో వదలించుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు కనపడుతున్నారు డైరెక్టర్ రవిబాబు. అందుకే వచ్చే వేసవి సెలవులే టార్గెట్‌గా ఓ అడల్డ్ కామెడీ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జనవరి 24న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని, అదే రోజు సినిమాలో నటీ నటులు ఎవరు అనే విషయాలను వెల్లడిస్తామని ప్రకటించారు.
యువతకు సంబంధించిన ఓ సమస్యను చిత్రీకరించబోతున్నట్లు మాత్రం ప్రకటించారు రవిబాబు. వైవిధ్యభరిత సినిమాలు తీసే పేరున్న రవిబాబుకు కొంత కాలంగా పెద్దగా హిట్ సినిమాలు లేకపోవటంతో అడల్ట్ కామెడీ వైపు మళ్లీనట్లు కనపడుతోంది.
న్యూ ఇయర్‌కు 500కోట్లు తాగేశారు
న్యూ ఇయర్ వేడుకల్లో తాగి పట్టుబడ్డ వారి లిస్ట్ ఇదే
Advertisements
మరీ ఈ సినిమా ఎలా ఉంటుందో, రవిబాబుకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.