హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఆదివారం కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. హైకోర్టు కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. ఈ విషయంపై ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
తాజాగా ఈ ఘటనపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. నగర మేయర్ విజయలక్ష్మిపై సెటైర్లు వేశారు. ఆమెను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ వరుస ట్వీట్లు చేయడం వివాదాస్పదం అయ్యాయి.
ఆమె తన కుక్కకు కుడి చేత్తో ఫుడ్ తినిపిస్తూ.. ఎడమ చేత్తో తాను తింటున్న వీడియోను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కుక్కలపై మేయర్ గారి ప్రేమ చాలా ఉన్నతంగా ఉంది. కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకెళ్లి ఫుడ్ తినిపిస్తే.. అవి మా పిల్లల్ని తినవు అంటూ ట్వీట్ చేశారు.
కుక్కలపై ఇంత ప్రేమ చూపిస్తున్న మేయర్.. నగరంలో ఉన్న 5 లక్షల కుక్కలను ఇంటికి తీసుకెళ్లి మధ్యలో మేయర్ కూర్చుంటే ఇంకా బాగుంటుందని కామెంట్ చేశారు.
ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయని మేయర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఆర్జీవి. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించటం విస్మయకరమన్నారు. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే చిన్న పిల్లలకు రక్షణ అని పేర్కొన్నారు.
Hey @GadwalvijayaTRS why don’t u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won’t eat our children ? pic.twitter.com/2dfa426hRv
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023