హ్యాపీ డేస్ సినిమాతో యూత్ ని ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య అనారోగ్యంతో శనివారం ఉదయం 6 గంటలకు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్‌స్టోరి సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.