దర్శకుడు శంకర్.. ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు. కమల్ హసన్ హీరోగా 1996లో శంకర్ భారతీయుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభమైనప్పటినుంచి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్, శంకర్ మధ్య ప్రారంభంలోనే విభేదాలు తలెత్తాయి. కరోనా తరువాత ఈ సినిమా పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైంది. ఈ నేపథ్యంలో నే శంకర్ వేరే ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికంటే ముందు తన కూతురు పెళ్లి పనులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం తన కూతురు అదితి పెళ్లి పనులతో శంకర్ ప్రస్తుతం బిజీ అయిపోయారట. సినిమా పనులను తాత్కాలికంగా ఆయన పక్కన పెట్టి పెళ్లి తర్వాత తన తరువాత ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారని సమాచారం.