ఇండియా టాప్ దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. పోస్టర్ పైన ఈయన పేరు కనిపిస్తే చాలు.. సినిమా గ్యారెంటీ హిట్ అవుతుంది. అలాగే శంకర్ తీసే ప్రతీ సినిమాలోనూ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఓ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది.
శంకర్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో ‘అపరిచితుడు’ మూవీ ఒకటి. ఈ చిత్రం సౌత్ లోని అన్ని భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోగా విక్రమ్ నటించగా, సదా ఆయనకు జోడీగా నటించింది. అపరిచితుడులో విక్రమ్ నటన పెద్ద అసెట్. విక్రమ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మూడు పాత్రల్లో విక్రమ్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఈ చిత్రం లో స్క్రీన్ ప్లే , టేకింగ్, పాటలు అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అప్పట్లో ఈ చిత్రం చాలా రికార్డులను క్రియేట్ చేసింది.
ఈ సినిమా కథను శంకర్ మొదట రజనీకాంత్ కు వినిపించారట. కానీ రజనీ ఈ కథను రిజెక్ట్ చేశాడట. దీంతో విక్రమ్ వద్దకు అపరిచితుడు స్క్రిప్ట్ వెళ్ళింది. విక్రమ్ కెరీర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోయింది. నిర్లక్ష్యం, లేజినెస్, అవినీతి , కల్తీ వలన దేశం ఎలా అభివృద్ధి చెందకుండా అలానే ఉండిపోతుందో అనే కాన్సెప్ట్ తో శంకర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ చిత్రం లో విక్రమ్ రాము, రెమో, అపరిచితుడు పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమాలో రాము లాయర్ కావడంతో ఓ సారి బైక్ వైర్ తెగితే ఆ కంపెనీ ని కోర్ట్ కి లాగుతాడు. కానీ ఈ సినిమాలో రాము చాలా సార్లు బండి నడుపుతాడు కానీ హెల్మెట్ పెట్టుకోడు. అప్పుడు సినిమాలో ఇది ఎవరూ గమనించలేదు. కానీ అన్ని రూల్స్ మాట్లాడే రాము హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.