కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సహాయంగా సినీ తారలు తమ వంతు సహాయాన్ని అందజేస్తామని ముందుకు వస్తున్నారు. ఈక్రమంలో సినీ ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూ..తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ మహేష్ బాబు 4కోట్లను ప్రకటించగా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 కోట్లు, మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున కోటి రూపాయలు.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ 75 లక్షలు ఇంకా చాలామంది హీరోలు విరాళాలు ప్రకటించారు.
అంతేకాకుండా సినీపరిశ్రమలో రోజువారి వేతనంతో పని చేసే చిన్నస్థాయి కళాకారులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా కరోనా క్రైసస్ ఛారిటీకి కూడా విరాళాలను ప్రకటిస్తున్నారు. నాగార్జున, చిరంజీవి కోటి రూపాయలు…రామ్ చరణ్ 30 లక్షలు..ఎన్టీఆర్ 25 లక్షలు.. .. మహేష్ బాబు 25 లక్షలు.. రవితేజ, వరుణ్ తేజ్ 20 లక్షలు.. శర్వానంద్ 15 లక్షలు ఇలా చాలా మంది సాయం చేసారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి నుంచి అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. దీంతో ఆయన విరాళం ప్రకటించకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు రాజమౌళి.
ఇప్పుడు దేశం ఓ విపత్కర పరిస్థితులో ఉందని చెప్పారు. ఇప్పుడు దేశ సేవ చేయడమంటే ఇంట్లోనే ఉండటమని సరికొత్త అర్ధం చెప్పుకొచ్చారు. అంత ఇంట్లో ఉండి కరోనాను అంతం చేయాలని సూచించారు. అలాగే కరోనాపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వాలకు తమ వంతు సహాయం చేస్తోన్న సినీ ప్రముఖులను రాజమౌళి అభినందించారు. కరోనా మహమ్మారి పేరు వింటేనే భయపడుతోన్న వేళ వైద్యులు,నర్సులు , పారా మెడికల్ సిబ్బంది మాత్రం ధైర్యంతో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారని వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పాడు. వాళ్లకు వ్యక్తిగతంగా కొన్ని రక్షణ పరికరాలు అవసరమని.. ఒక్కసారి వాడితే మళ్ళీ, మళ్ళీ వాడుకునే చాన్స్ ఉండదు కనుక మా టీం అంత కలిసి వైద్యులకు భారీగా ఫేస్ మాస్కులతో పాటు ప్రొటెక్టర్స్ కూడా అందించబోతున్నామని చెప్పాడు.