‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడుగా సుజీత్ హిట్ కొట్టేశాడు. ఆ సినిమా తరువాత భారీ అంచనాల నడుమ ప్రభాస్ తో సాహో సినిమాను తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా అభిమానులను మాత్రం నిరాశ పర్చింది. కాగా చిన్న వయస్సులోనే అంత భారీ బడ్జెట్ తో సినిమా రూపొందించడంతో సుజీత్ పెద్ద సాహసమే చేశాడనే ప్రశంసలను అందుకున్నాడు.
దాంతో నెక్స్ట్ సుజీత్ ఏ హీరోతో కలిసి సినిమా ప్లాన్ చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. గత సినిమా అభిమానులను నిరాశ పర్చడంతో ఈ సినిమా కథను సుజీత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. కాగా రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు సుజీత్ కథను కూడా చేశాడని.. రేపో.. మాపో కథను చరణ్ కు వినిపిస్తాడని ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది. అయితే ఇందుకు చరణ్ అంగీకరిస్తే సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు కాచుకొని కుర్చున్నారట. మరి చరణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.