రంగస్థలం సూపర్ సక్సెస్ తర్వాత పుష్ప సినిమాపై ఫోకస్ చేశారు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ తో ఓవైపు పుష్ప సినిమా షూట్ కొనసాగుతుండగానే… కొన్ని కథలపై సుకుమార్ ఫోకస్ పెట్టాడు, కరోనా సమయంలో సుకుమార్ కొన్ని స్క్రిప్ట్స్ వర్కవుట్ చేయగా… ప్రస్తుతం నిఖిల్ 18 పేజేస్ తో పాటు సాయి ధరమ్ తేజ్ తో ఓ మ్యూజికల్ సినిమా చేస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ లెక్కల మాష్టారు మరో సినిమా ప్రకటించారు. ఆర్ఎక్స్ 100హీరో కార్తీకేయతో సినిమా చేయనున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించటంతో పాటు అన్ని సినిమాను పర్యవేక్షించనున్నారు. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న్ చావు కబురు చల్లగా సినిమా పూర్తి చేసిన కార్తికేయ… ఈ సినిమాకు రెడీ అయ్యాడు. అయితే, ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది త్వరలో ప్రకటించనున్నారు.
ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాను కూడా సుకుమార్ పర్యవేక్షించారు. సినిమా లాభాల్లో వాటాను రెమ్యూనరేషన్ తీసుకునే సుక్కు… ఉప్పెనకు ఏకంగా 25కోట్లు సంపాదించినట్లు ఫిలింనగర్ టాక్.
Creative director @aryasukku to produce Young Hero @ActorKartikeya's next under @SukumarWritings 🔥
Story-Screenplay-Dialogues by #Sukumar ⚡️
Stay Tuned for more Official updates… pic.twitter.com/puwdQ6uuNO
— Sukumar Writings (@SukumarWritings) March 12, 2021