టాప్ డైరెక్టర్ సుకుమార్ ఉప్పెన సినిమాను ఫస్ట్ నుండి పర్యవేక్షించారు. తన వద్ద పనిచేసిన బుచ్చిబాబు ఫస్ట్ సినిమా కావటంతో ప్రతి సీన్ ను అద్భుతంగా వచ్చేలా చూశాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు సుకుమార్ కూడా ఈ మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరు.
ఈ సినిమా లాభాలను చెరో సగం తీసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారు. అనుకున్నట్లుగా చిన్న సినిమానే అయినా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా దాదాపు 50కోట్లను కొల్లగొట్టింది. నాన్-థియరేటికల్ రైట్స్ కూడా మంచి రేటుకు అమ్ముడైపోయాయి.
ఇందులో సగం సుకుమార్ కు వెళ్లనున్నాయి. అంటే సుకుమార్ ఓ పూర్తి స్థాయి సినిమా చేసినంత రెమ్యూనరేషన్ ఉప్పెన ద్వారా వచ్చినట్లయ్యింది. ఈ సినిమా భారీ హిట్ కొట్టడంతో వైష్ణవ్ తేజ్, క్రితీ శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు మంచి రెమ్యూనరేషన్ పొందారు.