టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ప్రియమిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ మరణించారు. శనివారం మధ్యాహ్నం ప్రసాద్ కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సుమకుమార్ శోకసంద్రంలో మునిగారు. అయితే ప్రసాద్ గతంలో ‘అమరం అఖిలం ప్రేమ’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
సుకుమార్ కు ప్రసాద్ అత్యంత సన్నిహితుడు. సుకుమార్ వద్ద మేనేజర్ గా పని చేశారు. దర్శకుడు సుకుమార్ కు ఎప్పుడు నిరాశ కలిగిన ప్రసాద్ తో కొంత సమయం గడుతానని ఎన్నోసార్లు చెప్పారు. ఆయనతో మాట్లాడితే నిరాశ మొత్తం దూరమయ్యేదని చెప్పేవారు. ప్రసాద్ ప్రభావం తన జీవితంపై ఎంతో ఉందని ఆయన పలుమార్లు తెలిపారు.తనకు ప్రసాద్ మృతి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ప్రసాద్ లేనిలోటును ఎవరూ భర్తీ చేయాలంటూ సుకుమార్ వాపోయాడు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రసాద్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని సుకుమార్ తెలిపారు.