సుకుమార్ టీంలో కీలక సభ్యుడిగా ఉన్న బుచ్చిబాబు మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాతోనే వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి హీరో, హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.
సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇటీవలే సినిమా చూసిన సుకుమార్… సినిమా సూపర్ సక్సెస్ కొడుతుందన్న నమ్మకంతో ఉన్నాడట. అయితే అక్కడక్కడ చిన్న మార్పులు సూచించటంతో… సినిమా రెండున్నర గంటల పాటు రన్ టైంతో రాబోతుందని తెలుస్తోంది.
డిజిటల్ రిలీజ్ కు వెళ్లకుండా సరైన సమయం కోసం వెయిట్ చేయాలని సుకుమార్ సూచించాడని తెలుస్తోంది. దీంతో క్రిస్మస్ సెలవుల్లో కానీ సంక్రాంతి బరిలో కానీ ఉప్పెనను రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భావిస్తోంది. డిజిటల్ రిలీజ్ కోసం ఉప్పెనకు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకే టీం మొగ్గుచూపుతోంది.