సైరా సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ తర్వాత సినిమాలేమీ అనౌన్స్ చేయలేదు. కొన్ని కథలను సిద్ధం చేస్తున్న సురేందర్ రెడ్డి ఇప్పుడు పవన్ ను డైరెక్ట్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్.ఆర్.టీ పతాకం సినిమా చేయబోతుందని అధికారికంగా ప్రకటించారు.
కొంతకాలంగా రామ్ తల్లూరి నిర్మాణ సారథ్యంలో సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే సినిమా కథను సురేందర్ రెడ్డితో పాటు వక్కంతం వంశీలు ఫైనల్ చేయనున్నారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తారు.
పవన్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యాక 2022లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ చేస్తున్న పవన్, ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నారు.