అంతనొక్కడే సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా తన మార్క్ చూపించిన దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆ తరువాత ఎన్టీఆర్, రవితేజ, రాంచరణ్ , అల్లుఅర్జున్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసి తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నర్సింహరెడ్డి సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అయితే సైరా సినిమా తరువాత చిరు కొరటాల దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేశాడు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు సినిమాను పట్టాలెక్కించలేదు. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు , యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కోసం సురేందర్ రెడ్డి కథలు రెడీ చేశాడట. కానీ ఆ ఇద్దరు కూడా సురేందర్ రెడ్డి కథకు నో చెప్పారట. ఇక చేసేది ఏమి లేక అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట సురేందర్ రెడ్డి. గతంలో సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి అల్లు అర్జున్ హీరోగా రేసుగుర్రం సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు సినిమా చెయ్యాలని సురేందర్ రెడ్డి బావిస్తున్నాడట.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతికి అలవైకుంఠపురములో సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత బన్నీ రేసుగుర్రం సీక్వెల్ కథకు రెడీ అవుతాడా లేక ఇంకేమన్నా ప్రత్యామ్నాయం వెతుక్కుంటాడా అనేది వేచి చూడాలి.