అతనొక్కడే సినిమాతో టాలీవుడ్ లో తానేంటో నిరూపించుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇటీవల మెగా స్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సైరా సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. మళ్లీ ఇప్పుడు మెగా హీరోనే నమ్ముకున్నాడు సురేందర్ రెడ్డి. సైరా సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఎలాగైనా సినిమా చెయ్యాలని భావించిన సురేందర్ రెడ్డి ఓ కథని రాసుకుని ప్రభాస్ కు వినిపించాడట. కానీ ఆ కథకు పాన్ ఇండియా లెవెల్ లేదని నో చెప్పాడట ప్రభాస్.
దీంతో ఆ కథనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు సురేందర్ రెడ్డి చెప్పాడట. వరుణ్ ఆ కథకు ఒకే చెప్పాడని, ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వరుణ్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఎఫ్ 2 , గద్దలకొండ గణేష్ సినిమాలుతో విజయం సాధించిన మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే.