పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమా హిట్ కావడంతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను వచ్చింది. విజయ్ దేవరకొండ కు కూడా హీరోగా పెళ్లి చూపులు సినిమాతో పరిచయం అయ్యాడు. విశ్వేక్ సేన్ తో “ఈనరానికి ఏమైంది” తెరకెక్కించి… మంచి ఫ్లాట్ ఫామ్ అందించాడు. ఇప్పటివరకు తరుణ్ తీసిన సినిమాలన్నీ యూత్ కు తెగ నచ్చేసాయి. కాగా తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వూ లో ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పానని ఎన్టీఆర్ నుండి సమాధానం కోసం వెయిట్ చేస్తున్నానని అన్నాడు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు ఆ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. కాగా ఆ సినిమా అనంతరం తరుణ్ సినిమాలో నటిస్తాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.