డైరెక్టర్ తేజకు చిత్రం సినిమా ఎంత ఘన విజయం సాధించిపెట్టిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత తేజ కెరీర్ అంతా ఒడిదుడుకులతోనే సాగింది. సీత మూవీ బోల్తాకొట్టిన తర్వాత కొంచెం సమయం తీసుకున్న తేజ వరుసగా రెండు సినిమాలను పట్టాలెక్కించబోతున్నాడు.
రాక్షస రాజు రవణాసురుడు, అలిమేలు మంగతయారు సినిమాలను రెడీ చేశాడు. ఈ సినిమాల్లో రానా దగ్గుబాటి, గోపిచంద్ మలినేనిలు హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా… తేజ తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. తన సూపర్ హిట్ మూవీ చిత్రం సీక్వెల్ చేయబోతున్నాడు. ఈ సినిమాలోనూ పూర్తిగా కొత్త ముఖాలతో రాబోతున్నాడని తెలుస్తోంది. ఆర్పీ పట్నాయక్, సమీర్ రెడ్డిలు కూడా సినిమాకు పనిచేయనున్నారు. ఈ సంవత్సరమే మూవీ పట్టాలెక్కనుంది.