దర్శకుడు తేజ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ టైటిల్ పోస్టర్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి విక్రమాదిత్య అనే పేరు పెట్టారు. ఇది 1836 నాటి ఒక క్లాసిక్ పీరియడ్ లవ్ స్టోరీ.
సర్ ఆర్థర్ కాటన్ అదే కాలంలో దౌలేశ్వరం బ్యారేజీని నిర్మించాడని, ఈ సినిమాలో ప్రేమకథ కేసుల అప్పుడు జరుగుతుందని సమాచారం. టైటిల్ పోస్టర్ విషయానికి వస్తే, రైలు నుంచి వచ్చే పొగ అందులో ప్రేమను వ్యక్త పరుస్తూ ఇద్దరు ప్రేమికులు కనిపిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ మంగళవారం మధ్యాహ్నం 2:22 గంటలకు ప్రారంభం అయింది. గమనించదగ్గ విషయం ఏంటంటే తేజ సూపర్ హిట్ జయం కూడా 20 సంవత్సరాల క్రితం ఇదే తేదీన సెట్స్‌పైకి వెళ్లింది.
అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి ఇంకా రివీల్ చెయ్యలేదు. నల్లమలుపు శ్రీనివాస్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.