చిత్రం సినిమాతో చిన్న సినిమాల రేంజ్ పెంచిన దర్శకుడు తేజ. ఈ సినిమాతో ఎంతో మంది కొత్త నటులు వెలుగులోకి రాగా… అందులో ఉదయ్ కిరణ్ ఒకడు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలతో యూత్ ఐకాన్ గా మారాడు.
ఇప్పుడు తేజ చిత్రం మూవీకి సీక్వెల్ రెడీ చేస్తున్నాడు. చిత్రం 1.1 అనే పేరుతో సినిమా తీయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నారు. అయితే, ఇందులో ఉదయ్ కిరణ్ ప్లేసు ఎవరు భర్తీ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం… తేజ కొడుకు అమితవ్ తేజని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితవ్ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో ట్రయల్ షూట్ ఉంటుందని… ఒకే అనిపిస్తే మాత్రం హీరోగా ప్రమోట్ చేయబోతున్నారు.