గత కొంత కాలంగా హిందీలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మన రాజ్యం నుంచి వస్తున్న మూవీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.ఆర్టికల్ 15, సెక్షన్ 375 ఈ కోవలోకి వచ్చేవే. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని తెలుగులో స్టార్ట్ చేస్తూ డైరెక్టర్ తేజ ఒక సినిమాని మొదలుపెట్టడానికి రెడీ అయ్యాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన తేజ, ‘ఆర్టికల్ 370’ పేరుతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
రీసెంట్ గా ఈ ఆర్టికల్ 370 రద్దు, ఇండియాలో సంచలనం సృష్టించింది. ఈ ఒక్క నిర్ణయం కారణంగా జమ్మూ కాశ్మీర్ రెండుగా విడిపోయింది. ఇంతటి వివాదాస్పద కంటెంట్ తో తేజ సినిమా చేయనున్నాడు. అయితే తేజ ఆర్టికల్ 370ని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా తెరకెక్కించనున్నాడట. మరి ఈ బైలింగ్వల్ మూవీలో ఎవరు నటిస్తారు? ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.