కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏ రంగానికి చెందిన వారినీ వైరస్ వదలడం లేదు. టాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారినపడటం కలవరం రేపుతోంది. ఇటీవలే డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలీకి కరోనా సోకగా.. తాజాగా మరో టాలీవుడ్ దర్శకుడు కరోనా బారినపడ్డారు.
దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం తేజ ఒక వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ముందు జాగ్రత చర్యల్లో భాగంగా యూనిట్ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా తేజకు పాజిటివ్ అని తేలింది. ఆయన కుటుంబ సభ్యులు అలాగే యూనిట్ సభ్యులందరికీ నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం తేజ హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.