పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండతో పాటు తరుణ్ భాస్కర్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేసినా… పెద్దగా హిట్ కొట్టలేదు. కానీ బాలీవుడ్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడని ప్రచారం సాగింది. టీ సీరీస్ ఈ సినిమా చేస్తుందని చెప్పినా అది అలా ఆగిపోగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చిందని… ప్రభాస్‌తో మూవీ ఉండే అవకాశం ఉందని రకరకాల ప్రచారం సాగింది.
కానీ తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తానంటూ ఈటీవీ కోసం ఓ షో చేయబోతున్నాడు. వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడన్న ప్రచారం ఉంది కానీ సడన్‌గా ఇలా ఈటీవీలో ప్రత్యక్షం కావటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికైతే 25 ఏపిసోడ్స్‌తో షో ఉంటుందని, షో రెస్పాన్స్‌ను బట్టి ఫ్యూచర్ డిసైడ్ కాబోతుంది.
మరీ ఇక్కడైన తరుణ్ భాస్కర్ లక్ ఎలా ఉందో చూడాలి.