యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ తన తరువాత సినిమాను త్రివిక్రమ్ తో ఇప్పటికే ఎనౌన్స్ చేశాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. ఆ వార్త ఏంటో తెలుసా..త్రివిక్రమ్ ఇప్పటి వరకు ట్రై చేయని జోనర్ లో ఈ సినిమాను చేయబోతున్నాడట.
ఇప్పటికే కథ కూడా సిద్దం అయ్యిందట. ఇప్పుడు ఈ వార్త నందమూరి ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడూ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు చేస్తూ హిట్ కొట్టే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మళ్లీ ప్రయోగం చేస్తే అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని టెన్షన్ పడుతున్నారు నందమూరి ఫ్యాన్స్.