త్రివిక్రమ్… తన పంచ్ డైలాగులతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మైమరిపింపజేస్తాడు. డైలాగ్ రైటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు 25కోట్ల వరకు చార్జ్ చేసే దర్శకుడు. అయినా ఇతర దర్శకుల కోరిక మేరకు డైలాగ్స్ రాస్తూనే ఉన్నారు.
ఇప్పటికే అయ్యపురం కోష్యిం రీమేక్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ బాధ్యతలు చూసుకున్న త్రివిక్రమ్ ను గతంలోనే డైరెక్టర్ గుణశేఖర్ సంప్రదించాడని తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా కథనాయకుడిగా హిరణ్య కశ్యప తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం డైలాగ్స్ రాయాల్సిందిగా గుణశేఖర్ రిక్వెస్ట్ చేయగా… త్రివిక్రమ్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తను సినిమా పనులు ఇంకా మొదలుపెట్టక పోవటంతో త్రివిక్రమ్ తన పని కూడా అలా పక్కన పెట్టాడ.
రాబోయే రోజుల్లో గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేయబోతున్నాడు. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో త్రివిక్రమ్ టైం ఇస్తాడో లేదో చూడాలి.