పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలు పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితాలలో కూడా ఈ ఇద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆఖరుగా వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కు కూడా ఈ సినిమానే లాస్ట్ సినిమా. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉన్న పవన్ రాజకీయాలుపై పూర్తి దృష్టి పెట్టారు.
అయితే గత కొంతకాలంగా పవన్ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని, పింక్ రీమేక్ సినిమాలో నటించనున్నారని తెలుస్తుంది. పింక్ సినిమా ఒక్కటే కాదు ఇక నుంచి సినిమాలు చెయ్యాలనే ఆలోచనలో పవన్ ఉన్నాడని సమాచారం. ఈ విషయమై ఫిలింనగర్ లో గుస గుసలు వినిపిస్తుంటే ఆ వార్తలకు బలం చేకూర్చింది ఓ ఫోటో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కలిశారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మొదట అలవైకుంఠపురములో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా పిలవటానికి వెళ్ళాడు అనుకున్నారు. కానీ ఫిలింనగర్ లో ఇంకో వార్త కూడా వినిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని దానికి సంబందించిన విషయాలను మాట్లాడటానికి త్రివిక్రమ్ కలిసారని సమాచారం. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.