మంచి కమర్షియల్ హిట్స్ అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వి.వి వినాయక్. కానీ కొంతకాలంగా చేతిలో సినిమాలు లేక ఇబ్బందిపడుతున్న వినాయక్ లూసిఫర్ రీమేక్ బాధ్యతలు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ మెగాస్టార్ నటించబోయే లూసిఫర్ రీమేక్ నుండి కూడా తప్పుకున్న వినాయక్ కు బాలీవుడ్ ఛాన్స్ వచ్చేసింది.
తెలుగులో సెన్సెషనల్ హిట్ మూవీ చత్రపతి హిందీలో రీమేక్ కానుంది. ఇందులో అల్లుడు శ్రీను ఫేం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కనపడనున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ గా వినాయక్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. అల్లుడు శ్రీనుతో బెల్లంకొండను హీరోగా పరిచయం చేసింది కూడా వినాయక్ కావటం విశేషం.
తెలుగు ఓరిజినల్ స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాదే ఇప్పుడు హిందీ రీమేక్ కు కూడా కథను అందించబోతున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ యాక్షన్ చిత్రాలన్నీ హిందీలో డబ్ అవుతుండటం, మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చత్రపతి మూవీని బెల్లంకొండతో రీమేక్ చేయబోతున్నారు.