మహర్షి సినిమాతో హిట్ కొట్టి, మహేష్ బాబుతోనే మరో సినిమా చేయాలని ఖాళీగా ఉండిపోయిన దర్శకుడు వంశీ పైడిపల్లి. వంశీ కథ నచ్చకపోవటంతో మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కానీ ఇతర పెద్ద హీరోలు కూడా ఎవరూ ఖాళీగా లేరు. పైగా ఒకట్రెండు సినిమాలు చేసేందుకు ఇప్పటికే ఒకే చెప్పేసి ఉన్నారు.
ఖాళీగా ఉన్న వంశీ… ఇటీవలే పవన్ ను కలిశారు. కథను వినిపించి సినిమా చేయాలన్న ప్రతిపాదన పెట్టాడు. కానీ ఆ సినిమా ఓకే అయినా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదు. దీంతో వంశీ ఇటీవలే అల్లు అర్జున్ కలిసినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాతో బిజీగా ఉన్న బన్నీ… ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. కొరటాల శివకు కాస్త లేటయితేనే వంశీకి అవకాశం దొరకనుంది.
ఇప్పటికే పెద్ద హీరోలను వరుసగా కలుస్తున్న వంశీ ప్రయత్నం ఎప్పటికి వర్కవుట్ అవుతుందో చూడాలి.