మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి వెళ్లాడు. నిజానికి సినిమా తర్వాత ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు మహేష్ బాబు. తనతో పాటు ఫ్యామిలీని కూడా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తు ఉంటాడు.
అయితే ఇటీవల కాలంలో మహేష్ ఎక్కడ ఉంటే డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా దుబాయ్ లో ల్యాండ్ అయ్యారు వంశీ పైడిపల్లి. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై నుంచి దిగిన ఫోటోల్ని షేర్ చేశాడు వంశీ. నిజానికి ఈ ఇద్దరు గతంలో మహర్షి సినిమా చేశారు. ఈ సినిమా తరువాత మరో స్టోరీ వంశీ పైడిపల్లి మహేష్ బాబు కు చెప్పాడు. కానీ మహేష్ కు అది నచ్చలేదట. అయినప్పటికీ కూడా ఈ ఇద్దరి స్నేహం కొనసాగుతూనే ఉంది.