బిగ్ బాస్ తెలుగు సీజన్4 చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు జెన్యూన్ వంటి అంశాలపై ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే, విచిత్రంగా ఓ పార్టిసిపెంట్ కోసం వర్మ ప్రచారం చేస్తున్నారు. తననే గెలిపించాలని కోరుతున్నారు.
బిగ్ బాస్ హౌజ్ లో ఈమె ఎంతకాలం ఉంటుందిలే… అన్న దగ్గర నుండి ఈమె బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతుందేమో అన్నట్లుగా తనను తాను మార్చుకున్న అరియానాను గెలిపించాలని వర్మ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా కోరుతున్నారు. ఆమెకే టైటిల్ దక్కాలని కోరుతున్నాడు.
VOTE and MAKE ARIYANA WIN ..TRULY DESERVING in BIG BOSS 👍👍👍https://t.co/EnzmWOZkCP pic.twitter.com/hbS5QCXjDK
— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2020