లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఈ అమ్మడు డైరెక్టర్ విగ్నేష్ ను వివాహం చేసుకుంది. జూన్ 9న వీరి వివాహం జరిగింది. ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు వివాహంతో ఒక్కటయ్యారు. అయితే మీరు పెళ్లికి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలా చాలా మంది హాజరయ్యారు. ఇక పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే వేరు వేరు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన హక్కులను 25 కోట్లకు నెట్ ఫ్లిక్స్ అమ్మిందట నయన్. ఇక ఇదే విషయంపై దర్శకుడు వేలు ప్రభాకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న నటులు కూడా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారి వ్యక్తిగత పర్యటనలకు విదేశాలకు వెకేషన్స్ కి వెళ్లడానికి ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన హెలికాఫ్టర్లను పెట్టుకుంటున్నారు. అలాగే నయన్ విగ్నేష్ ల పెళ్లి గురించి కూడా మాట్లాడారు.
ఆమె పెళ్లి హక్కులను అమ్మటంలో ఆమెకు హక్కు ఉంది. కానీ ఆ పెళ్లిని ప్రసారం చేసి ప్రేక్షకుల నుంచి 500 కోట్లు కొనుక్కున్నవారు సంపాదిస్తారు. ఇదే పద్ధతి ప్రతి సెలబ్రిటీకి ఆనవాయితీగా మారుతుంది. ప్రజలకు సెలబ్రిటీలు వారి విలాసాలకు చూపించుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టి వివాహాలు చేసుకొని దానికన్నా పెద్ద మొత్తం లో అమ్ముకుంటున్నారు.
అయితే ఇలాంటి వారందరూ కూడా అప్పటి హీరో ఎంజిఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు వేలు ప్రభాకరన్. ఆయన ఎంత సాదా జీవితం గడిపేవారు ఈ కాలం నటులు తెలుసుకోవాలన్నారు. తన బంధువులు కుటుంబ సభ్యుల పెళ్లిళ్లు కూడా ఘనంగా జరపడానికి ఇష్టపడేవారు కాదని. ప్రతి రూపాయి పేద ప్రజల నుంచి వచ్చిందని ఆయన భావించేవారని అన్నారు. అయితే ఇప్పుడు ప్రభాకరన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.