టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ మహ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో KGF 2 సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్‌పై కామెంట్ చేశాడు. ఆ సమయంలో హీరో క్యారెక్టరైజేషన్‌ను టార్గెట్ చేసి నీచ్ కమీన్ కుత్తే అంటూ మాట్లాడాడు. దీంతో వెంకటేష్ మహపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. శాండిల్ వుడ్, KGF మూవీ ఫ్యాన్స్ వెంకట్ మహను ట్రోల్ చేశారు. తన సినిమాలపై విమర్శలు చేశారు.
చివరకు వెంకట్ మహ తన సోషల్ మీడియా ద్వారా ఇంటర్వ్యూలో తను అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందటూ వివరణ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశారు. భాష తప్పుగా ఉండొచ్చు తప్ప.. ఒపినియన్ కాదని, దీంట్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పేశాడు వెంకటేష్ మహ. ‘నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కేవలం నాదొక్కడిదే కాదు. కొంత మంది వ్యక్తుల అభిప్రాయం. నా సినిమాలు నచ్చేవాళ్లు, ఇతరులు చాలా మంది నాకు మెసేజ్‌లు పెట్టారు. వారందరి తరపున నా వాయిస్ అది. ఆ సమయంలో నేను మాట్లాడిన భాష సరైంది కాదు. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను.
అయితే ఆ సమయంలో డిస్కస్ చేసిన పాయింట్ విషయంలో నేను నా అభిప్రాయాన్ని మార్చుకోను. నేను మాట్లాడింది. సినిమాలోని ఓ కల్పిత పాత్రను గురించి మాట్లాడింది. నా ఒపినీయన్‌లో అది ప్రాబ్లమెటిక్ పాత్రగా అనిపించి మాట్లాడాను. డైరెక్ట్‌గా ఏ వ్యక్తిని, క్రియేటివ్ పర్సన్‌ని ఉద్దేశించి అన్నమాట కాదు. దాన్ని ఓ వ్యక్తికి ఆపాదించటం చూస్తుంటే నా ఓపినియన్ మీరు చూస్తున్న విధానంలో వచ్చిన సమస్యలాగా నాకు అనిపిస్తుంది.
ఓ కల్పిత పాత్రను నేను దూషించాను. అందుకు ఓ రియల్ పాత్రగా ఉన్న నన్ను ఎన్నో రకాలుగా దూషిస్తున్నారు. అసభ్యంగా నా ఇమేజ్‌లను క్రియేట్ చేస్తున్నారు. ఇది కొత్తేం కాదు. చాలా సార్లు ఇది చూశాం. ఇలాంటి ఎన్నో ఘటనల ఆధారంగానే నాకు ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓపినియన్ క్రియేట్ అయ్యింది. నా ఓపినియన్‌ని గౌరవిస్తారని నేను భావిస్తున్నాను. అలాగే అన్ని రకాల సినిమాలను ఒకేలా ఆదరిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు వెంకటేష్ మహ.